Christmas Songs
పుట్టినరోజు శ్రీ యేసురాజు
ఈ మహిపాప పరిహారి మన ప్రేమరాజు – రాజాధిరాజు
1.నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా – నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా – చిగురించెను దావీదు వంశాధికారి ||రాజాధిరాజు||
2.ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు – ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
పూజ లొనరించెగా తేజమనిపించెగా – భూజనంబు మనంబుల ప్రేమాధికారి ||రాజాధిరాజు||
3.పరిమార్చను నీ ఘోర పాపంబులు – తొలగించను లోక విచారంబులు
కరుణా బృందమూ పరమానందమూ – నీ నేరము బాపెడి లోకాధికారి ||రాజాధిరాజు||
4.నీతి స్థాపించు సీయోను పురవాసిగా – పరలోకంబు నేలేటి వేవెల్లుగా
త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ – మహిమాన్విత పూజిత సర్వాధికారి ||రాజాధిరాజు||