Christmas Songs
చింతలేదిక
యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున
చెంతచేరను రండి సర్వజనాంగమా
సంతస మొందుమా
1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
నా దివసంబు వింతగా
ఖ్యాతిమీరగ
వారు యేసుని గాంచిరి స్తుతులొనరించిరి ||చింతలేదిక||
2. చుక్క కనుగొని జ్ఞానులెంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా
బెత్లేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింతలేదిక||
3. కన్య గర్భము నందు బుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తు
ధన్యులగుటకు
రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింతలేదిక||
4. పాపమెల్లను పరిహరింపను పరమ
రక్షకుడవతరించెను
దాపుజేరిన
వారికిడు కడు భాగ్యము మోక్ష భాగ్యము
||చింతలేదిక||