Christmas Songs
బాల యేసుకు జోలలు
పాడ యీ వేళ -పరలోక సైన్యముల్ పాటలు పాడెన్
ఆ వేళ = హద్దు
దప్పిన లోకములోన ఆవేళ = జన్మించె శాంతి ప్రియుడై
ప్రేమామయుడై
నీతికి స్థాపకుడై
|| బాల ||
1. కన్య మేరి ధన్య
చరిత్రుండా వేళ - మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ
అవతరించె పరిహార
మొనర్చన్ ఆవేళ - మన జీవిత లోపాలు దురంతాలు
ఘోరమౌ పాపాలు
|| బాల ||
2. పశులశాలలో శిశువై
వెలసెన్ ఆవేళ - సువిశాల లోకపు శోకము మాపెన్
యీ వేళ = చిన్ని
బాలలానంద వినోదం ఈ వేళ - చిరునవ్వులు వికసించె
ప్రకాశించె
ప్రీతిమై పరికించె
|| బాల ||
3. హృదయసీమ
పదిలంబాయె యీవేళ - మదిలోని మమతలే మారణమాయె
యీవేళ = తార
వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆవేళ - ఆ చల్లని మార్గంబు
సరాళంబు పాపికి
తరుణంబు
|| బాల ||