- నీ ధనము - నీ ఘనము ప్రభు యేసుదే
- నీ దశమ భాగము నీయ వెనుదీతువా
- 1) ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించికాపాడిరక్షింపగా
- పరలోక నాధుండు నీ కీయగామరి యేసుకొరకీయవెనుదీతువా
- 2) పాడిపంటలుప్రభువునీకీయగా కూడుగుడ్డలు నీకుదయచేయగా
- వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవ
- 3) వెలుగు నీడలు గాలివర్షంబులు – కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
- వెలిగించ ధరపైన ప్రభునామమును కలిమికొలది ప్రభునకర్పింపవా
- 4) కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు
- బలియాయే నీ పాపముల కోసమే చెలువంగ ప్రభుకీయ చింతింతువా
Sunday, July 28, 2019
నీ ధనము - నీ ఘనము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment