Sunday, July 28, 2019

నీ ధనము - నీ ఘనము



  • నీ ధనము - నీ ఘనము ప్రభు యేసుదే
  • నీ దశమ భాగము నీయ వెనుదీతువా

  • 1)  ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించికాపాడిరక్షింపగా
  •      పరలోక నాధుండు నీ కీయగామరి          యేసుకొరకీయవెనుదీతువా 

  • 2) పాడిపంటలుప్రభువునీకీయగా కూడుగుడ్డలు నీకుదయచేయగా
  •   వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవ 

  • 3)  వెలుగు నీడలు గాలివర్షంబులు – కలిగించె ప్రభునీకు ఉచితంబుగా 
  •     వెలిగించ ధరపైన ప్రభునామమును కలిమికొలది ప్రభునకర్పింపవా

  • 4) కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు 
  •    బలియాయే నీ పాపముల కోసమే  చెలువంగ ప్రభుకీయ చింతింతువా 

యుద్ధము యెహొవాదే


యుద్ధము యెహొవాదే (4)

1. రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2)

2. వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2) 

3. యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)

Saturday, July 27, 2019

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా






నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే

నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
కేవలం నీదేనయ్య

నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
కేవలం నీదేనయ్య

Matlade devuduvu neevu



మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||

1)నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||


2)నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||

Saturday, July 20, 2019

శుద్ధ హృదయం

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం – నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను – దోషినై యున్నాను -2 
తెలిసి యున్నది నా అతిక్రమమే – తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2
 ||శుద్ధ హృదయం||
2. నీ జ్ఞానమును నీ సత్యమును – నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 
కలుగజేయుము నా హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2||శుద్ధ హృదయం||